ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక!
- అర్ధరాత్రి 2 గంటలకు బెంగళూరు నుంచి విజయవాడ చేరుకున్న గవర్నర్
- తెల్లవారుజామున తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డ వైనం
- మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరు పర్యటన ముగించుకుని అర్ధరాత్రి 2 గంటలకు విజయవాడ చేరుకున్న ఆయనకు, తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణంలో విమానం ఆలస్యం కావడం, విశ్రాంతి లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, గవర్నర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.